Book Minutiae…!!!
Title: జ్వలించండి-జ్యోతులై-Jwalinchandi-Jyothulai
Author: R. Navajeevan Reddy
Print Length: 227
Publisher: Blue Star Publication
Genre: Self-Help
Rating: ⭐⭐⭐⭐⭐
Book Information…!!!
“నా కవనాలు లోకానికి కిరణాలు బానిసవర్గానికి ఆశాజ్యోతులు కార్మిక లోకపు ఆర్తనాదాలు యువశక్తికి ప్రగతిమార్గాలు”. ప్రతి ఒక్కరికి కష్టకాలంలో ధైర్యాన్ని ఇస్తూ,ముందుకు సాగిపొమ్మని చేయూతగా నిలిచేదే ఈ పుస్తకం.ప్రశ్నిస్తూ,బలాన్ని గుర్తుచేస్తూ,యువకులకు చైతన్యాన్ని ఇస్తూ ఈ కవనం సాగిపోయింది.మీ మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంది అని ఆశిస్తూ…

About Author…!!!
R. Navajeevan Reddy started writing in 2011. Along the way, he faced many criticisms. People asked, “Who will read your work? Why do you write?” he continued writing while also working as a motivational speaker, delivering messages on stage, and encouraging youth. He also wrote proverbs.

Navajeevan Reddy published his first book, “Navajeevan Gamyam,” in 2022 after his wife Revathi, encouraged him to release it. Receiving an award for the first book is a proud moment as an author, which led to the release of three more books at once. Even now, he continues to question the injustices and irregularities in society. He expresses his thoughts through books.
In his words:
- My pen is the voice of the people.
- My poetry is the sunrise that awakens society.
- My journey is a relentless quest for Ram Rajya.
- It never stops; it never tires. 🙏
My Preamble…!!!
సినీ గేయ రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చెప్పినట్టు “ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి | | ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి” ఆ లాంటి ప్రేరణ స్ఫూర్తిని నింపడానికి మన నవజీవన రెడ్డి గారు పాఠకులకు అద్భుతమైన వచన కవిత సంకలనం అందించారు. ఇది నేను చదివిన రెడ్డి గారి నాలుగవ పుస్తకం. వచన కవిత్వం లో తనదైన ముద్ర వేసిన రెడ్డి గారు ఈ సంపుటి లో వంద పైచిలుకు కవితలని అందించారు.

“జ్వలించండి-జ్యోతులై-Jwalinchandi-Jyothulai” is a provocative collection of 100+ poetic verses questioning the age-old myths and unchanged society practices. The author expressed his profound thoughts through the poetic medium, centered on the almighty, nature, life lessons, and so on.
My Take…!!!
తన రచన శైలిని అనుసరించి నవజీవన రెడ్డి గారు తన ప్రతి కవితల ద్వారా సమాజ శ్రేయస్సు, గంభీరమైన భావ ప్రకటన, సామజిక అసమానతలు మరియు దైవత్వపు ప్రేమ, మరియు ఆదరణ తో పాటు సృజనాత్మకత సమ్మిళితంగా అందించారు. పాఠకులకు ఆహ్లాదాన్ని అందిస్తూ ఆలోచింపజేసే సాంకేతికత రెడ్డి గారికే దక్కింది.
Book Emphasis..!!!
Following his writing style, Navajeevan Reddy garu has expressed social welfare, profound emotional expressions, social inequalities, divine love, and admiration, combined with creativity in all his poems. Every poem presented in this work is unique and equally ignites your strength and challenges you to dig deep into your inner Consciousness.

My Pick..!!!
‘జీవితరథ చక్రాలు‘ అనే భాగం లో ఆశావహ జీవన ఎదురీత ను కడు రమనీయంగా ప్రస్తుతించారు. ‘ఇవ్వడానికి ఏముంది‘ అనే శీర్షిక తో వేదాంతపు మెరుగులు దిద్ది ఆశల సోపానాలు మరియు భవబంధన త్యజన కు బాటల అవసరాన్ని నొక్కి వక్కాణించారు. ‘హృదయేశ్వర‘ అనే కవిత్వం లో మన సమకాలీన సమస్యలను ఎత్తి చూపుతూ భగవంతుని ఆగమన అవసరిని తెలియజేసారు.
ఇవి మచ్చుకు కొన్నే. పాఠకులారా ఈ వచన కవిత్వం మీ అందరి పుస్తక అర లో ఉండే తీరవలసిన సంకలనం. పునః ధన్యవాదములు నవజీవన్ రెడ్డి. మీరు ఇలానే పాఠకులని స్ఫూర్తి నింపాలని మనస్పూర్తిగ కోరుకుంటున్న.
To Conclude..!!!
తను సమర్పించిన ప్రతి ఒక కవిత నా మనసును హత్తుకుంది. ప్రతి ఒక కవితలో నవజీవన్ రెడ్డి గారు స్ఫురణ తో పాటు స్ఫూర్తి ని నింపుతూ ఒక చక్కనైన సందేశాన్ని అందించారు. నిస్సందేహంగా రెడ్డి గారి వల్లే వ్యక్తిగతంగా వచన కవిత్వం పైన నాకు మక్కువ ఏర్పండింది.
తెలుగు లో నేను అనుసరిస్తున్న అతి తక్కువ రచయితలలో నవజీవన్ రెడ్డి గారు ఒకరు. తన రచనలలో సమాజ హితం, లింగ వివక్ష, బాధలను అధిగమించే విశ్వాసం, విజయాపథం అందుకొనే తత్వం నాకు నచ్చే అంశం. రెడ్డి గారు మీరు ఇలానే సమాజ హిత రచనలు చేయాలనీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ని మనసారా కోరుకుంటున్న.
If you wish to delve into poetic verses filled with motivation and positivity, with a tinge of inspiration, and to leave a mark on your heart. Do pick this book and savor the nectar of amiability and momentum.
My Quote(s) pick..!!!
- నడకలోనూ, మాటలోనూ స్పష్టత ఉన్నప్పుడు ఇక నీ విజయానికి అడ్డెక్కడుంది
- కాపాడుకోకపోతే రేపటికి సేద తీరడానికి ప్రకృతి ఉండదు…కాంక్రీట్ బిల్డింగ్స్ లో కృత్రిమ గాలి తప్ప..!
Foot Note…!!!
My Handle: Kiran_Kumar_Adharapuram
You can also explore my works -> Here
My Non-Fiction Book Reviews -> Here
My Fiction Book Reviews -> Here
My Self-Help Book Reviews -> Here
సర్వమంగళ రూపాయ శిరసానమేమి..!!