Book Minutiae…!!!
Title: కోకొరో (Kokoro)
Author: Natsume Soseki
Telugu Translation: శ్రీనివాస చక్రవర్తి
Publisher: Anil Battula Publications
Language : తెలుగు
Rating: ⭐⭐⭐⭐⭐
Book Information…!!!
సొసెకి నట్సుమే జపాన్ దేశానికి చెందిన కవి, నవలాకారుడు. ఈ జపనీస్ క్లాసిక్ నవలలో సెన్సే అనే యువకుడి జీవితంలోని ప్రేమ, స్నేహాల దాగుడుమూతల్ని మనసు కంటితో మనం చూడవచ్చు. తండ్రి మరణాంతరం పినతండ్రి తన ఆస్తినంతా కాజేస్తే, మనుషుల మీద విశ్వాసాన్ని కోల్పోతాడు. వివాహం చేసుకోవాలనుకున్న యువతి ద్రోహం చేస్తుంది. స్నేహితుడు ఆత్మహత్య చేసుకుంటాడు. మరి సెన్సే జీవితం చివరికి ఏమైంది? ఈ నవల ఆధారంగా ఖొన్ ఈచికవ దర్శకత్వంలో 1955లో ‘ KOKORO ‘ అనే జపనీస్ సినిమా వచ్చింది. ఈ నవలను శ్రీనివాస చక్రవర్తి అనువదించారు.


About Author(s)…!!!
కోకొరో (Kokoro) అనేది జపాన్ గొప్ప రచయిత సొసేకి నట్సుమే (Natsume Soseki) రాసిన ప్రఖ్యాత నవల, ఇది ఒక యువకుడు, అతని రహస్యమైన స్నేహితుడు ‘సెన్సే’ మధ్య సంబంధాన్ని, వారి జీవితంలోని ప్రేమ, స్నేహం, ద్రోహం, ఒంటరితనం, మరియు మరణం వంటి లోతైన మానవ భావోద్వేగాలను వివరిస్తుంది; ఈ నవల జపాన్ సంప్రదాయం నుండి ఆధునికత వైపు మారుతున్న నేపథ్యంలో సాగుతుంది, ఇందులో సెన్సే గతం నుండి దాచుకున్న రహస్యం, అతని గురించిన విస్మయకరమైన నిజాలు కథను ముందుకు నడిపిస్తాయి, దీనిని తెలుగులోకి శ్రీనివాస చక్రవర్తి అనువదించారు
My Preamble…!!!
శ్రీనివాస చక్రవర్తి (1911-1976) గారు తెలుగు లో అనువదించిన ‘కోకోరో’ సొసెకి నట్సుమే రచించిన జపనీస్ మూల నవల. సొసెకీ (1867-1916) జపాన్ దేశపు ప్రఖ్యాత కవి, నవలాకారుడు, తాను తన మరణానికి రెండు సంవత్సరాల ముందు రచించిన ఈ నవల ను మొట్టమొదటి సారిగా 1941 లో ఆంగ్లం లో తర్జుమా చేశారు. ఈ నవల మూలంగా 1955 మరియు 1973 లో దృశ్యరూపకంగా విడుదల అయింది.
శ్రీనివాస చక్రవర్తి ద్వారా అనువదించిన ఈ నవల మూడు సార్లు ప్రచురించబడినది కాగా ఇప్పుడు 2025 లో మన ప్రియతమా అనిల్ బత్తుల గారి పబ్లికేషన్ ద్వారా పున: ప్రచురితం అయింది. ఈ పుస్తక ముఖచిత్రం బంగారు బ్రహ్మం [బాబాయి] గారి కళాత్మకమైన ప్రతిభ మరియు సృజనాత్మకతకు దర్పణం.

My Take…!!!
కమలారా ప్రాంతం లో సొసెకీ తనకు పరిచయమైనా సెన్స్ అనే యువకుని యధార్థ గాధ కు ఈ నవల దర్పణం. సెన్స్ తన జీవనపు బాట లో ఎదురైనా ఆటు పోట్లు, స్నేహం ప్రేమ, నమ్మక ద్రోహం, ఇతరత్రా భావోద్వేగాలు ఈ నవల యందు ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. ఉన్న నాలుగే పాత్రల ద్వారా సొసెకీ పాఠకులకు చక్కటి సందేశం తో పాటు దాంపత్య జీవన సూత్రాలను ఆసక్తికరంగా అందించారు.
సొసెకీ సెన్స్ మధ్య జరిగే వాదం, తర్కము,మరియు సంభాషణలు ఆనాటి జపనీస్ సంస్కృతి తో పాటు నేటి నవతర జీవనశైలి కి వారధి గా నిలుస్తుంది. మన తప్పులు సరి దిద్దుకొని బలహీన క్షణాలని మెరుగుగా సంభాళించి మన జీవనం అనే నావ ను ఒద్దు చేర్చే సామర్థ్యం అందించే అర్థత ఉన్న రచన పట్టిక లో ఈ పుస్తకం తప్పక ఉంటుంది.
What’s special inside the book..!!
మూలతహా జపనీస్ నవల అయినప్పటికీ శ్రీనివాస గారు తెలుగు గుబాళింపు మరియు సుగంధం చక్కగా ఈ నవల కు అద్దారు. కొన్ని గ్రాంధికమైన పదాలు మన సొంత పల్లెటూరి వాతావరణాన్ని తలపుకు తెస్తుంది. సెన్స్ ఇంకా తన మిత్రుడు కే మధ్య స్నేహం ఎంతటి అగాధం లో కి జీవితం నెట్టివేయ బడుతుందో ఈ నవల ప్రస్ఫుటం చేస్తుంది. తండ్రి కొడుకుల ప్రేమ అనురాగం ఆప్యాయత సెన్స్ జీవితం లో ఎంతటి మార్పులు తీసుకు వస్తుంది ఈ నవల లో అతి కీలకాంశం. మిత్రులారా విశ్లేషణ దృశ్య నేను పూర్తి కథను ఇక్కడ ప్రస్తావన చేయడం లేదు.
Book Emphasis..!!!
నవల చివర లో సెన్స్ తన మరణానికి పూర్వం వ్రాసిన ఉత్తరం ఈ నవలకు జీవనాడీ. ఆ ఉత్తరం ద్వారా పాఠకుల ను కంటతడి పేటేంత పని చేస్తాడు సొసెకీ. దాంపత్య జీవనం తో పాటు నయవంచన లాంటి వాస్తవికలను ప్రతిభింబించారు రచయిత. నిసందేహంగా ఈ సంవత్సరపు నా ఉత్తమ పఠన పట్టిక లో ఈ పుస్తకం ఉంటుంది. అనిల్ గారు ఇలాంటీ అత్యుత్తమ అనువాదాలను మాలాంటి పాఠకులకు అందించాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నాను

My Pick..!!
చిట్ట చివరిలో ఆత్మహత్య(లు) అనే ఘట్టం మనో భంగం కలిగించిన, కథ పరివర్తన దృష్ట్యా ఈ నవల చాల వరకు పాఠకులకు సందేశాత్మక స్ఫూర్తి తో పాటు ఆహ్లాదాన్ని కలిగించింది అనే చెప్పాలి. ఈ పుస్తక పరిచయం ముందు మాట లో ప్రస్తావించిన కారణాన నేను లోతైన కథా విశ్లేషణ జోలికి వెళ్లడంలేదు. శ్రీనివాస చక్రవర్తి గారి రచన కౌశలం ఈ నవల లో తేటతెల్లం. ఈ పుస్తక పఠనం ఒక సుందరమైన అనుభూతుని మిగులుస్తోంది అనే మాట ను ఖరాకండి గ చెప్పగలను.
మన వాస్తవికలను మరియు జీవన విధానాలను ప్రతిభింబించే ఈ నవల ను పున: ప్రచురుంచి పరిచయం చేసే ఉదేశపు బహుముఖ ప్రజ్ఞశీలి అనిల్ బత్తుల గారి ఉదార స్వభావానికి పాఠకులు ఎల్లప్పటికీ కృతజ్ఞులై. అతి ముఖ్యంగా పురాతన జపాన్ ప్రదేశాలు ఇంకా ప్రాంతాల పేర్లు ప్రస్తావించడం ద్వారా జపాన్ ఆచార విచారాలు, వారి ఆహారపు అలవాట్లు ఇంకా వాస్తవికతలు పాఠకులు ప్రత్యక్షంగా జపాన్ దేశ పర్యటన పుస్తక రూపేణ రచయితలు కలిగించారు.

To Conclude..!!!
అక్కడక్కడా కథ పరమైన లోపాలు ఉన్నపటికీ, ఈ నవల నేను విమర్శించే అర్హత సుతరాము లేదని దృడంగా భావిస్తున్నాను. ఓ నా పుస్తక ప్రేమికులారా! ఈ పుస్తకం విరివి గా కొని అనిల్ గారిని ప్రచురణ విజయపదం వైపు దూసుకెళ్లే మనసారా అభిలషించి ఆశీర్వదిదం.
My Quote(s) pick..!!!
- ప్రేమ పాపభూయిష్టమయింది, చిత్రమేమంటే ప్రేమ పవిత్రమయింది కూడా ను
- నీ అభిప్రాయాలు అనుభవం వల్ల పుట్టినవి
Foot Note…!!!
My Handle: Kiran_Kumar_Adharapuram
You can also explore my works -> Here
My Non-Fiction Book Reviews -> Here
My Fiction Book Reviews -> Here
My Self-Help Book Reviews -> Here


