సొసెకి నట్సుమే జపాన్ దేశానికి చెందిన కవి, నవలాకారుడు. ఈ జపనీస్ క్లాసిక్ నవలలో సెన్సే అనే యువకుడి జీవితంలోని ప్రేమ, స్నేహాల దాగుడుమూతల్ని మనసు కంటితో మనం చూడవచ్చు. తండ్రి మరణాంతరం పినతండ్రి తన ఆస్తినంతా కాజేస్తే, మనుషుల మీద విశ్వాసాన్ని కోల్పోతాడు. వివాహం చేసుకోవాలనుకున్న యువతి ద్రోహం చేస్తుంది. స్నేహితుడు ఆత్మహత్య చేసుకుంటాడు. మరి సెన్సే జీవితం చివరికి ఏమైంది?